AP: సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, వికలాంగుల పెన్షన్ల తనిఖీలు, పునర్విచారణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. మంచానికే పరిమితమై రూ. 15వేల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించనున్నాయి. నెలకు రూ.6వేలు తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు నిర్వహించనున్నారు. తనిఖీల సమయంలో 18 ప్రశ్నలకు పెన్షన్ దారుల నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది.