బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలావరకు రైతులు వరి నూర్పులు పూర్తి చేసుకోగా, కొందరు ఇంకా పూర్తి చేసుకోలేకపోయారు. వర్షాలు ఎప్పుడు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందనుకన్న పంట.. పొలాల్లోనే తడిచి ముద్దయిపోతోంది. పలు చోట్ల నూర్పులు పూర్తయిన ధాన్యం మిల్లులకు చేరక రైతులు అల్లాడుతున్నారు.