పార్వతీపురంలోని బడిదేవరకొండ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం పిఓసి ఆదాడ మోహన్ రావు తెలిపారు. మంగళవారం మంగళగిరిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణకు బడిదేవర కొండపై జరుగుతున్న అక్రమ గ్రానైట్ తవ్వకాలపై ఫిర్యాదు అందజేశానన్నారు.