ఉమ్మడి గుంటూరు జిల్లాకు వర్ష సూచన
ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశ ఉందని వెల్లడించింది. అల్లూరి, మన్యం, కోనసీమ, తూ.గో,ప.గో,ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.