వైన్ షాపులో దూరి రూ.12 లక్షలు చోరీ (వీడియో)

569பார்த்தது
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దుకాణం పైకప్పు రేకులు పగులగొట్టి లోనికి ప్రవేశించి సుమారు రూ.12 లక్షలు నగదు ఎత్తుకెళ్లాడు. శుక్ర, శనివారం రెండు రోజుల కలెక్షన్ డబ్బు గల్లా పెట్టెలో ఉన్నాయి. దుండగుడు డబ్బు లెక్క పెట్టుకోవడం సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. ఆదివారం ఉదయం మద్యం దుకాణం తెరిచి చూడగా చోరీ జరిగినట్లు నిర్వాహకులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி