నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అనంతసాగరం మండలం సిపిఎం నేత పుల్లయ్య ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. లింగంగుంట గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సిపిఎం పోరాటాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించి విరాళాలు సేకరించారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు అందుకే విరాళాలు సేకరిస్తున్నామన్నారు.