మహానంది ఈశ్వర్ నగర్ కాలనీలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమ సమీపంలో వివాదాస్పద స్థలాన్ని మండల రెవెన్యూ అధికారులు శనివారం పరిశీలించారు. గత కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి దేవతమూర్తుల విగ్రహాలు తొలగించడంతో, వివాదాస్పదంగా మారడంతో దానిని రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బారావు, విఆర్ఓ చలమయ్యలు పరిశీలించారు. తొలగింపునకు సంబంధించి కొందరు గ్రామస్తులు మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు.