మహానంది లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
మహానందిలోని తహశీల్దార్ కార్యాలయం నుండి ఈశ్వర్ నగర్ కాలనీలోకి సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఎంపిపి బడ్డారెడ్డి యశశ్విని భూమిపూజ చేశారు. పల్లెపండుగా పంచాయితీ వారోత్సవాలు కార్యక్రమంలోభాగంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, బన్నురు రామలింగారెడ్డి ఆదేశాల మేరకు 13లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. సర్పంచ్ చలం శిరీష, ఎంపిడిఓ మహబూబ్ దౌల తదితరులు పాల్గొన్నారు.