మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలో నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారిపై రోడ్డుకి అడ్డంగా వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వృక్షం కూలింది. ఈ రహదారిలో ప్రయాణించే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుపై కూలిన వృక్షాన్ని తొలగించాలని వాహనదారులు, ప్రజలు శనివారం కోరుతున్నారు.