పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత గోవిందమ్మ దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని.. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొగ్గుల తిక్కన్న, గుమ్మల లక్ష్మన్న, ఆరకంటి జంబన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత గోవిందమ్మను కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గోవిందమ్మ దాడి వెనుక ఉన్న అసలైన దోషులను పోలీసులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.