టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చించారు. అక్టోబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రూ. 100 సభ్యత్వంతో కార్యకర్తలకు రూ. 5లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం కోసం సాయం అందించనున్నారు.