అకాల వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా విజయవాడ భావన్నారాయణ వీధిలోని తేలప్రోలు బాపనయ్య విద్యా ధర్మనిధి ట్రస్ట్ పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2లక్షలు విరాళం అందించింది. ఈ సందర్భంగా విరాళం చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి మైలవరపు కృష్ణ తేజకు శుక్రవారం అందజేశారు.