ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువుతీరి ఉన్న అమ్మవారికి సోమవారం అయ్యప్ప నగర్, విజయవాడకు చెందిన కొల్లూరి విజయలక్ష్మి దంపతులు అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం విరాళముగా అందజేశారు. ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజును కలిసి రూ. 1, 11, 111లను చెక్కు రూపములో విరాళంగా అందజేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.