ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని 5వ వార్డ్ లైన్ బజార్లో శుక్రవారం రాత్రి మిలాద్-ఉన్-నబీ (బారా ఫతేహ) ఉత్సవం సందర్భంగా ఘనంగా అన్నదానం జరిగింది. ఇది ఆబిద ఖాతున్ (వైట్ ఖాన్ కుమార్తె) ఆధ్వర్యంలో జరగగా, ఆమె మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌ను విశ్వ శాంతి కోసం అల్లాహ్ నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని స్మరించుకోవడం కోసం మిలాద్-ఉన్-నబీ జరుపుకుంటామని చెప్పారు.