రాష్ట్రపతికి పాశర్లపూడి హైవే బాధితుల విన్నపం

61பார்த்தது
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రలోభాలకు లొంగి ఎన్. హెచ్ విభాగం అధికారులు అలైన్మెంట్లో మార్పులు చేశారని ఆరోపిస్తూ మామిడికుదురు మండలం పాసర్లపూడి హైవే బాధితులు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అర్జీ పెట్టుకున్నారు. 2014 అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. దానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించాలని కోరామని బాధితులు ఆదివారం తెలిపారు.

தொடர்புடைய செய்தி