క్షతగాత్రులకు ఎంపీ పరామర్శ
తేనె టీగల దాడి, పిచ్చికుక్క దాడిలో గాయపడి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ మంగళవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు.