తూ. గో జిల్లాలో ప్రజల సమస్యలు తహసిల్దార్, ఆర్డీవో స్థాయి అధికారుల వద్దనే పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆర్డీవోలు, తహసిల్దారులతో సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు తన దృష్టికి ఎందుకు వస్తున్నాయని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఇకపై ప్రతి సమస్యను మండల స్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.