ఏపీలో హోంమంత్రి అసలు ఉన్నారా? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే హోం మంత్రి అసలే స్పందించలేదు. చేసినవాడు తమ మనిషి కాబట్టి, నిస్సిగ్గుగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అఘాయిత్యం చేసిన వ్యక్తి పేరు నవీన్. సాక్ష్యాత్తు చంద్రబాబే టీడీపీ కండువా కప్పారు. నిందితుడు స్థానిక ఎంపీతో కలిసి తిరిగాడు. ఏ తప్పు జరగలేదంటూ ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది" అని జగన్ అన్నారు.