ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఎన్ టి ఆర్ కాలనీలో నూతన రామాలయ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు మండల ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షుడు బండారు నాగరాజు, గ్రామ సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, మాజీ గ్రామ ఉపసర్పంచ్ అడపా శీను, శ్రీధర్ వీరాచారి, సప్ప వీరబాబు, నాగరాజు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.