మచిలీపట్నం: వృద్ధులు పట్ల మర్యాదగా ప్రవర్తించాలి
పోలీస్ స్టేషన్ కు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ చట్టం చేసిందని వారికి నెలకు 10 వేల రూపాయల చొప్పున అందించాల్సి ఉందన్నారు. జిల్లా ఎస్పీ గంగాధర్ పాల్గొన్నారు