దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అర్. గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని ముఖ్యమైన కూడళ్లలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రణకు కృషి చేయాలన్నారు.