మచిలీపట్నం: మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని మహిళలు నిరసన
మద్యం షాపులను నివాస గృహాల మధ్య ఏర్పాటు చేయరాదంటూ ఘంటసాలకు చెందిన మహిళలు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ మీకోసం కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మద్యం షాపులను ఊరు బయట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఇప్పుడు దేవాలయాలకు, సమీపంలో నివాస గృహాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.