సమాజ సేవలో పోలీసుల పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు సంస్మరణ దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు. ప్రజా సేవలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది సేవల్ని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.