మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై జగన్ చేసిన ఆరోపణలపై చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై నమ్మకంతో మద్యం వ్యాపారులు స్వేచ్ఛగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకుని లాటరీలో షాపులు దక్కించుకున్నారన్నారు.