కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో సోమవారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 123 షాపులకు సంబంధించి టెండర్లు వేసిన వ్యక్తులు ఉదయాన్నే హిందూ కళాశాలకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎక్సైజ్ శాఖ అధికారులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడంతో పాటు టెండర్ దారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.