విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసుకుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం శివారు చిలకలపూడి పాండురంగ హైస్కూల్ లో విద్యార్థులకు యూనిఫామ్ మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఆత్మీయంగా పలకరించి మధ్యాహ్న భోజనం ఎలా ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.