ఖరీఫ్ సీజన్‌లో ఏపీలోని 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 మండలాల్లో తీవ్ర కరువు, మరో 27 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. వర్షాధారమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్క మండలం పేరు కూడా లేకపోవడం విశేషం.