వినియోదారుల వాహనాలకు ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేయకుండా డబ్భులు వసూలు చేయడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకి మంగళవారం వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలోని వరం సెంట్రల్ మాల్ లో రకరకాల షాపుల ఏర్పాటు చేసి అట్టి షాపులకు వచ్చే వినియోగదారులకు కచ్చితంగా ఉచిత పార్కింగ్ కల్పించాల్సిన మాల్ యజమానులు డబ్భులు వసూలు చేయడంపై వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.