మచిలీపట్నంలోని ఆర్. కె కాలేజీలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావు విద్యార్థులకు పలు చట్టాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలని ఆయన సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. ర్యాగింగ్ చేయడం చట్ట రీత్యా నేరమని, పోలీస్ శాఖ అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.