మచిలీపట్నం: ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన

75பார்த்தது
మచిలీపట్నం: ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన
జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన ఎంతో ఉపయోగపడుతుందని, ఈ సర్వేకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி