చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ముందుంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని పోలీస్ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమస్యల నిమిత్తమై అర్జీ ఇచ్చిన వారి సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి 42 అర్జీలు ఆయన స్వీకరించారు.