అనుమతులు లేని నిషేధింపబడిన బాణాసంచా దీపావళి సామాగ్రి గుర్తిస్తే 112 నెంబర్ కి సమాచారం తెలియజేయాలని కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. భద్రత చర్యలు పాటించే పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి అన్నారు. ప్రజలందరూ భద్రత చర్యలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకోవాలన్నారు.