రక్తదానం ప్రాణదానంతో సమానమని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం మచిలీపట్నంలోని పోలీస్ కల్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల రక్షణకై, ఆసాంఘిక శక్తుల అణచివేతలో ఎందరో పోలీసులు తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి అమరులయ్యారన్నారు. రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.