రాజమండ్రి నగరంలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.