డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని గంటి గ్రామంలో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించి పోయింది. భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. వేసవిని తలపిస్తూ ఎండలు కాయడం ఉక్క పోత తో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. దీంతో ప్రజలు సేద తీరారు.