AP: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలను జనవరి 11న, అనంతపురంలో 8 నుంచి 10 వరకు జరగాల్సిన పరీక్షలను 17 నుంచి 20 తేదీల్లో , చిత్తూరులో 8, 9న జరగాల్సిన పరీక్షలను 17, 18 తేదీలకు మార్చినట్లు పేర్కొంది.