సత్యవేడు మండలం కన్నావరం గ్రామంలోని దళితవాడ సమీపంలోని అంగన్వాడి కేంద్రం ఎదురుగా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని శుక్రవారం స్థానికులు తెలిపారు. చెత్త కుప్పల నుంచి దుర్వాసన వస్తుందని, అధికారులు చొరవ చూపి వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో దోమలు వస్తున్నాయని తెలిపారు.