సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలంలో శనివారం తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయం కాగా, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. అల్ప పీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా మండలంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.