నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలో వున్న సత్రవాడ చెరువు సమీపం నాటు సారీబట్టిపై ఆకస్మిక తనిఖీ చేసి 600 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు. మంగళవారం ముందస్తుగా అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు సారీ బట్టీ వేసిన స్థావరానికి పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో చేరుకొని సారా తయారీ కోసం సిద్దంగా ఉంచిన 600 లీటర్ల సారా ఊటధ్వంసం చేశామన్నారు.