ఏపీ సీఎం చంద్రబాబు 7 నెలల్లోనే రూ.లక్ష కోట్లు అప్పు చేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. "కేవలం 6 నెలల్లోనే రూ.15500 కోట్ల విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజలపై భారం వేసింది. విద్యుత్ చార్జీలు పెంచుతుంటే పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? చంద్రబాబు హామీలకు ష్యూరిటీ లేదు. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇసుక రేట్లు అన్నీ పెంచారు. ఆరేడు నెలల్లోనే రూ.లక్ష కోట్లు అప్పు చేసి ఏం చేశారు?" అని రోజా ప్రశ్నించారు.