అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పీలేరు పంచాయతీ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం, మద్యం దుకాణాలు తెరవరాదని ఇన్చార్జ్ ఈఓ గురుమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2న జీవహింస చేయరాదని కోరారు. కాబట్టి మాంసం, మద్యం దుకాణాల యజమానులకు పీలేరు పంచాయతీ తరపున నోటీసులు జారీ చేశామని అన్నారు.