ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో.. శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ఆకు పూజ, అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అనంతరం ముద్ద బంతి పూల మాలలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు విరివిరిగా వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.