తాడిపత్రి మున్సిపాలిటీలో ఆధార్ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆధార్ కార్డులో మార్పులు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నూతన ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్, మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు.