పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు మున్సిపాలిటీ పరిధిలోని త్రాగునీరు, డ్రైనేజ్, వీధి లైట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.