అచ్యుతాపురంలో లాకౌట్ ప్రకటించిన అభిజిత్ కంపెనీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అచ్యుతాపురంలో రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించారు. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు రాయితీలు పొందుతున్న కంపెనీ కార్మికులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.