వరిలో సుడిదోమ నివారణకు తూటి ఆకుల కషాయం తయారీ

75பார்த்தது
వరిలో సుడిదోమ నివారణకు తూటి ఆకుల కషాయం తయారీ
పాయకరావుపేట మండలం శ్రీరాంపురం క్లస్టర్ కేశవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులతో.. పలుచోట్ల సామూహికంగా తూటి ఆకుల కషాయం తయారు చేయించారు. వరిలో వచ్చే సుడిదోమ నివారణకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ తూటి కాడ కాషాయం అద్భుతంగా పనిచేస్తుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ రామ గోవిందు మాట్లాడుతూ.. ఎటువంటి ఖర్చు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరిలో వచ్చే సుడిదోమను తూటికాడ కషాయంతో నివారణ చేయవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி