ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న పల్లె పండుగ కార్యక్రమం పండగలా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన నర్సీపట్నంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై నర్సీపట్నం నియోజకవర్గం మండలాలకు పంచాయతీల అభివృద్ధికి ఎన్ ఆర్ ఇ జి ఎస్ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులనుండి అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసినట్లు తెలిపారు.