అంబేద్కర్ విగ్రహంపై దాడి దురదృష్టకరం
భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై దాడి దరదృష్టకరమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ అన్నారు. దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో గొడవలు సృష్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.