యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ శుక్రవారం పత్రిక సమావేశం నిర్వహించారు.
శివకుమార్ మాట్లాడుతూ, కొలనుపాక రెవెన్యూ గ్రామ పరిధిలో కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు, పట్టాదారు పాసు పుస్తకాలతో ఆగస్టు 5 వ తేదీ వరకు వచ్చి రైతు బీమాకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతు బీమా అన్నదాతలకు ఆపద సమయంలో అండగా నిలుస్తుందని అన్నారు.