TG: నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ సమన్లు

53பார்த்தது
నారాయణ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై కమిషన్ సీరియస్ అయింది. ఇటీవల కాలంలో ముగ్గురు నారాయణ కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు సంబంధించి డిసెంబర్ 11, 2024 ఉదయం 11:00 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు సమన్లు ​​పంపింది. విద్యార్థుల భద్రతకు భంగం కలిగించే ఏదైనా సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

தொடர்புடைய செய்தி